PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు దంపతులు.. 7 d ago
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దర్శించుకున్నారు. తన భర్త వెంకట దత్తసాయి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సింధు దంపతులు స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేశారు.